Attorocities on Women Rahul Gandhi comments: అత్యాచారాలకు రాజధానిగా భారత్ మారింది: రాహుల్ గాంధీ
- అత్యాచారాలపై మన దేశాన్ని అంతర్జాతీయ మీడియా ప్రశ్నిస్తోంది
- యూపీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం కేసులో నిందితుడన్న రాహుల్
- వీటి నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ లో ‘దిశ’ ఉదంతం, యూపీలో ‘ఉన్నావో’ ఘటనలను రాహుల్ తీవ్ర స్థాయిలో ఖండించారు. అత్యాచారాలకు రాజధానిగా భారత్ మారిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన కేరళలో వయనాడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచారాల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు.
‘అత్యాచార ఘటనలకు సంబంధించి ప్రపంచ దేశాలన్నింటికీ.. భారత్ రాజధానిగా మారింది. అత్యాచారాలపై మన దేశాన్ని అంతర్జాతీయ మీడియా ప్రశ్నిస్తోంది’ అని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ హింసను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. యూపీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ స్పందించకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు.