Unnao: ఉన్నావో బాధితురాలి చివరి మాటలివే!

  • అప్పట్లో సంచలనం సృష్టించిన ఉన్నావో ఘటన
  • తాజాగా బాధితురాలిపై దాడి
  • కాలిన గాయాలతో బాధితురాలు మృతి
అప్పట్లో సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార ఘటన బాధితురాలిపై అత్యంత హేయమైన రీతిలో తాజాగా దాడి జరిగింది. తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన ఆమె చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూసింది. విచారణకు హాజరయ్యేందుకు కోర్టుకు వెళుతున్న ఆమె నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న ఆమె కిలోమీటరు దూరం అలాగే పరుగెత్తిన వైనం అందరినీ కలచివేసింది. ఆమె ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి.

దీనిపై ఆమె సోదరుడు మీడియాతో మాట్లాడారు. "నా సోదరి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాను. ఆమె ఒక్కటే చెప్పింది... నన్ను బతికించండి. నాకు చనిపోవాలని లేదు. అయితే వాళ్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు. వారిని తప్పకుండా ఉరి తీయాల్సిందే.. అని చెప్పింది. వారిలో ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని ఆమెకు బదులిచ్చాను" అంటూ బాధితురాలి సోదరుడు వెల్లడించారు.
Unnao
Uttar Pradesh
Police
Crime
Victim

More Telugu News