Chittoor District: అర్ధరాత్రి ప్రేయసి కోసం అమ్మాయిల హాస్టల్ లోకి ప్రియుడు.. భయంతో కేకలు వేసిన అమ్మాయిలు

  • చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
  • దమ్ముంటే అర్ధరాత్రి రావాలని అమ్మాయి సవాల్
  • అరెస్టు చేసిన పోలీసులు
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ యువకుడు తన ప్రేయసి కోసం అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇతర అమ్మాయిలు భయంతో కేకలు వేశారు. దమ్ముంటే అర్ధరాత్రి సమయంలో తానుంటోన్న హాస్టల్‌కి రావాలని తన ప్రేయసి రెచ్చగొట్టడంతోనే ఆ యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు.

హాస్టల్ గోడలు ఎక్కి అందులోకి ప్రవేశించి,  ప్రేయసికి ఫోన్‌ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని ఇతర అమ్మాయిలు, వాచ్‌ ఉమెన్‌ గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల వాహనం వెంటనే అక్కడకు చేరుకోవడాన్ని గుర్తించిన ఆ యువకుడు గోడల పైపుల నుంచి జారుతూ కిందకు దూకాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి పేరు భాను ప్రసాద్‌ అని తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అతడు పెయింటర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. 
Chittoor District
hostel

More Telugu News