Nityananda: నిత్యానంద కైలాసదేశానికి ప్రధానిగా తమిళనటి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఊహాగానాలు!

షార్ట్స్‌లో చూడండి
పిల్లల కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని విదేశాలకు చెక్కేసిన నిత్యానందకు సంబంధించి ఇటీవల బయటకు వచ్చిన ఓ విషయం సంచలనమైంది. దక్షిణ అమెరికా సమీపంలోని ఓ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద, తన 30 మంది శిష్యులతో కలిసి అక్కడే నివసిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ దేశానికి కైలాసదేశంగా పేరు కూడా పెట్టేశాడని, అక్కడికి టన్నుల కొద్దీ బంగారాన్ని కూడా తీసుకెళ్లాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా, బయటకు వచ్చిన మరో విషయం మరింత సంచలనమైంది.

నిత్యానంద కైలాసదేశానికి ఓ తమిళనటి ప్రధాని కానుందనేదే ఆ వార్త. తనకు అత్యంత సన్నిహితురాలైన తమిళనటిని ఆ దేశానికి ప్రధానమంత్రిగా నియమించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ నటి తెలుగు అమ్మాయేనని, పలు తెలుగు చిత్రాల్లో నటించిందని చెబుతున్నారు. గత కొంతకాలంగా ‘స్వామి’ సేవలోనే తరిస్తున్న ఆ నటి గురించి అప్పట్లో పెను దుమారమే రేగింది. అయినప్పటికీ తననే అంటిపెట్టుకుని ఉన్న ఆమెకు ప్రతిఫలంగా ఇప్పుడు నిత్యానంత ప్రధానమంత్రి పదవి ఇవ్వబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు, పోలీసులు మాత్రం నిత్యానంద ఎక్కడికీ పారిపోలేదని, దేశంలోనే ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెబుతున్నారు.
Go Back to Shorts
Nityananda
kidnap
Police
Tamil actress

More Telugu News