Eluru: ఏలూరులో వ్యభిచార ముఠా ఆటకట్టు.. విటుల్లో ఆయుర్వేద వైద్యుడు!

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గతరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లాయిగూడెం గృహకల్ప హౌసింగ్ కాలనీలో పుట్టా నీలవేణి (36) అనే మహిళ గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. నిన్న రాత్రి ఓ యువతి (25)ని తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడిచేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకురాలు సహా నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏలూరు శాంతినగర్‌, తాడేపల్లిగూడెంలోని బొమ్మిడికి చెందిన ఇద్దరు యువకులతోపాటు ఏలూరు దొంగలమండపం ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఉన్నారు. నీలవేణి తీసుకొచ్చిన యువతిని సంరక్షణ హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Eluru
West Godavari District
arrest

More Telugu News