Arabia sea: సోమాలియా దిశగా ప్రయాణిస్తున్న ‘పవన్’ తుపాన్

  • నైరుతి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడ్డ తుపాన్
  • శ్రీలంక ప్రతిపాదన దృష్ట్యా దీనికి ‘పవన్’ అని పేరు
  • భారత్ కు అంత ప్రమాదం ఉండకపోవచ్చు: వాతావరణ శాఖాధికారులు
నైరుతి అరేబియా సముద్రం మీదుగా నిన్న ఏర్పడ్డ తుపాన్ దక్షిణాఫ్రికాలోని సోమాలియా దిశగా ప్రయాణిస్తోంది. శ్రీలంక దేశం ప్రతిపాదన మేరకు ఈ తుపాన్ కు ‘పవన్’ అని నామకరణం చేశారు. రేపటి లోపు ఇది బలహీనపడుతుందని, ఈ తుపాన్ వల్ల భారత్ కు అంత ప్రమాదం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. నైరుతి అరేబియాలోని ఆఫ్రికా తీరంలో ‘పవన్’ తుపాన్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, కర్ణాటక తీరానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది.
Arabia sea
South Africa
Somalia
Sri Lanka

More Telugu News