Telugudesam: టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఫొటోలు ఇవిగో!

  • ఆత్మకూరులో టీడీపీ నూతన కార్యాలయం
  • ప్రారంభించిన చంద్రబాబునాయుడు
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు సమీపంలో నిర్మించిన టీడీపీ కొత్త కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా విచ్చేసి ప్రారంభోత్సవ పూజలు నిర్వహించారు. దీనిపై నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. పార్టీ ఆఫీసు అంటే కార్యకర్తలు, నేతలకు దేవాలయం వంటిదని అభివర్ణించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఏ పవిత్ర ఆశయాలతో తాత ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించారో, ఆ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రేరణ ఇచ్చే శక్తి స్థలంలా నూతన కార్యాలయం వర్ధిల్లాలని కోరుకుంటున్నట్టు లోకేశ్ ట్వీట్ చేశారు.
Telugudesam
Telugudesam
Chandrababu
Nara Lokesh
Atmakuru
Guntur District
Mangalagiri

More Telugu News