Disha: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ

  • ఎన్ కౌంటర్లను చట్టబద్ధం చేయాలని సూచన
  • దిశ ఆత్మ కచ్చితంగా శాంతించి ఉంటుందని వ్యాఖ్యలు
  • తెలంగాణ పోలీసులను అభినందించిన లాకెట్ చటర్జీ
దిశ ఎన్ కౌంటర్ అనంతరం తెలంగాణ పోలీసులను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూరిందని, ఆమె తల్లిదండ్రుల మనోక్షోభకు ఉపశమనం కలిగిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో, బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసుల చర్యను కొనియాడారు. అంతేకాదు, ఎన్ కౌంటర్లకు చట్టబద్ధత కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"దేశ ప్రజల మనోభావాల రీత్యా ఈ ఎన్ కౌంటర్ ఎంతో శుభపరిణామం. ఉదయాన్నే ఈ వార్త చూసి ఎంతో ఆనందించాను. బాధితురాలి ఆత్మ కచ్చితంగా శాంతించి ఉంటుంది. ఆమె కుటుంబసభ్యుల ఆగ్రహం కూడా చల్లారుతుంది. ఇలాంటి ఎన్ కౌంటర్లకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దారుణాలు జరిగితే నిందితులకు పది పదిహేను రోజుల్లోనే ఉరిశిక్ష అమలు చేయడం కానీ, వారిని ఎన్ కౌంటర్లలో చంపడం కానీ చేయాలి" అంటూ స్పందించారు.
Disha
Telangana
Hyderabad
Locket Chatterjee
BJP
Police

More Telugu News