KCR: మీరు ఏదైతే చేశారో అది కచ్చితంగా అభినందనీయం: సీఎం కేసీఆర్ పై హర్భజన్ సింగ్ ప్రశంసలు

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • నలుగుర్నీ కాల్చి చంపిన పోలీసులు
  • హర్షం వ్యక్తం చేసిన క్రికెట్ దిగ్గజం
దిశ హత్య జరిగిన నాటి నుంచి నిందితులను చంపేయాలన్న డిమాండ్లు ఏ స్థాయిలో వినిపించాయో తెలిసిందే. ఆ డిమాండ్లను నిజం చేస్తూ తెలంగాణ పోలీసులు దిశ నిందితులను ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. దీనిపై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు. 'శభాష్ తెలంగాణ సీఎం కేసీఆర్, శభాష్ తెలంగాణ పోలీస్' అంటూ అభినందించాడు. మీరు ఏదైతే చేశారో అది కచ్చితంగా అభినందించాల్సిన విషయమని వ్యాఖ్యానించాడు. మరెవ్వరూ ఇలాంటి నేరాలకు పాల్పడే ధైర్యం చేయరని, ఇది సరైన చర్య అని హర్భజన్ కొనియాడాడు.
KCR
Police
Telangana
Hyderabad
Disha
Harbhajan Singh

More Telugu News