Disha: 'ఎన్ కౌంటర్'పై ఏ విచారణ అక్కర్లేదు.. పోలీసులు భయపడాల్సిన అవసరం లేదు: రాజాసింగ్

  • పోలీసులను ఎంతో మంది తిట్టారు
  • అందులో నేనూ ఒకడిని 
  • పోలీసులకు హ్యాట్సాఫ్  
  • దేశ మంతా పోలీసులకు మద్దతుగా ఉంది
దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయంపై  బీజేపీ తెలంగాణ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దిశ ఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులను చాలా మంది తిట్టారని,  అందులో తానూ ఒకడినని అన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినందుకు పోలీసులకు హ్యాట్సాఫ్ తెలుపుతున్నానని చెప్పారు.

తెలంగాణ పోలీసులను చూసి ప్రతి రాష్ట్రం నేర్చుకోవాలని, భారత్ లో వేల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి రాష్ట్రంలోని పోలీసులు ఈ విధంగా చర్యలు తీసుకుంటే మహిళలపై దౌర్జన్యాలు ఆగిపోతాయని ఆయన తెలిపారు. పోలీసులు చేసిన ఈ ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారని ఆయన తెలిపారు. ఏ విచారణా అవసరం లేదని, పోలీసులు భయపడాల్సిన అవసరం లేదని, దేశ మంతా వారి వెంటే ఉందని వ్యాఖ్యానించారు.
Disha
Police
raja singh

More Telugu News