Vijay Sai Reddy: రాజధాని విషయాన్ని చంద్రబాబు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నాడో ప్రజలకు బాగా అర్థమైంది: విజయసాయి రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
రాజధాని విషయాన్ని చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నాడో ప్రజలకు బాగా అర్థమైందని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయనేదే అయన ప్రధాన బాధ అని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా కోసమే రాజధాని పర్యటన, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ఏనాడు పనిచేసింది లేదని విమర్శించారు.