Encounter: ఎన్ కౌంటర్ స్థలిలో చెల్లాచెదరుగా మృతదేహాలు!

షార్ట్స్‌లో చూడండి
చటాన్ పల్లి జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ కింద, ఎక్కడైతే దిశను దారుణంగా కాల్చేశారో, అక్కడికి సరిగ్గా 300 మీటర్ల దూరంలో నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెల్లాచెదరుగా పడి కనిపిస్తున్నాయి. సీన్ రీకన్ స్ట్రక్షన్ సమయంలో వీరంతా పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల ఆయుధాలు లాక్కోవడంతో పాటు రాళ్లను విసురుతూ పొలాల మీదుగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వీరి మృతదేహాలు పొలాల మధ్య 30 మీటర్ల విస్తీర్ణంలో పడివున్నాయి. ఈ ప్రాంతంలో చుట్టూ గుబురుగా ఉన్న చెట్లు, పొదలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, మరికాసేపట్లో వీటిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని తెలుస్తోంది. భారీగా తరలివస్తున్న ప్రజలను నియంత్రించడం క్లిష్టతరంగా మారిందని పోలీసులు అంటున్నారు.
Go Back to Shorts
Encounter
Police
Chatanpalli

More Telugu News