Disha: బ్రేకింగ్: దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్.. పారిపోతుండగా కాల్చివేత!

  • సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో తప్పించుకునే యత్నం
  • పారిపోతున్న నిందితులను కాల్చివేసిన పోలీసులు
  • నిందితులు నలుగురూ అక్కడికక్కడే మృతి
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు సమాచారం. పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ప్రధాన నిందితుడు అరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశను సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.
Disha
Encounter
Hyderabad
shamsahbad

More Telugu News