Madhya Pradesh: వివాహాల పేరుతో దోపిడీలు.. వారి స్టైల్‌లోనే ఝలక్ ఇచ్చిన పోలీసులు!

  • పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా
  • వరుడి తరపు బంధువుల పేరుతో రంగంలోకి పోలీసులు
  • చిక్కిన ముఠాను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు
వివాహాల పేరుతో దోచుకుంటున్న ముఠాకు పోలీసులు వారి స్టైల్‌లోనే షాకిచ్చారు. పెళ్లి కుమారుడి బంధువులుగా వెళ్లి మొత్తం ముఠాను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. పెళ్లి సంబంధం పేరుతో తమ ఇంటికి వచ్చిన కిరణ్ అనే మహిళ తమ ఇంట్లోని బంగారు నగలతో ఉడాయించిందన్న బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.

నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు ఆ మహిళ తరపు బృందం ఇలాగే పలు చోరీలకు పాల్పడినట్టు నిర్ధారించారు. దీంతో పోలీసులు పక్కాగా ప్లాన్ వేశారు. ఈ క్రమంలో పోలీసులే అబ్బాయి తరపు బంధువుల పేరుతో రంగంలోకి దిగారు. ఓసారి అందరం కలుసుకుని పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుందామని చెప్పారు. మరో మంచి బేరం దొరికిందని ముఠా సంబరపడింది. అనుకున్నట్టే కలుసుకునేందుకు వచ్చిన దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
Madhya Pradesh
Marriage
Police

More Telugu News