Janasena: పవన్ తన పేరును సార్థకం చేసుకుంటున్నాడు: అంబటి

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పేరును సార్థకం చేసుకుంటున్నారని సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పవనం అంటే గాలి అని, కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతూ తన పేరుకు సార్థకత చేకూర్చుకుంటున్నాడని అన్నారు.

చంద్రబాబు చేస్తున్న రౌండ్ టేబుల్ నాటకాలు అందరికీ తెలుసని, బాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల మాటలకు ఏ మాత్రం గౌరవం ఇచ్చారో పవన్ కు తెలియదా? అని మండిపడ్డారు. అప్పుడు చంద్రబాబును నిలదీయలేని పవన్ ఇప్పుడు ప్రతిపక్షాల తరపున మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
YSRCP
Ambati

More Telugu News