NTR: ఎన్టీఆర్, కేసీఆర్ ప్రభుత్వాల వల్లే మహిళలకు గౌరవం: ఎర్రబెల్లి

  • ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ హయాంలో మహిళలు బయటకు రాలేకపోయారన్న మంత్రి
  • మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని వెల్లడి
తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, కేసీఆర్ ప్రభుత్వాల వల్లే మహిళలకు గౌరవం చేకూరిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మహిళలు బయటకు రాలేకపోయారని ఆరోపించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని కీర్తించారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఐకేపీ గ్రూపులకు అధికారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తారని ఎర్రబెల్లి వెల్లడించారు. తెలంగాణలో ఇంకా సమస్యలు ఉన్నాయని, అన్నీ ఒకేసారి పరిష్కరించలేమని స్పష్టం చేశారు.
NTR
KCR
Errabelli
Telangana

More Telugu News