తన జైలు జీవితంపై చిదంబరం స్పందన
- జైల్లో చెక్క బల్లపై పడుకున్నా
- వెన్నుపూస, మెడ బలంగా తయారయ్యాయి
- మానసికంగా, శారీరకంగా మరింత బలవంతుడినయ్యా
కేంద్ర మంత్రిగా తనకు చాలా మంచి రికార్డు ఉందని చిదంబరం చెప్పారు. తనతో పని చేసిన ఉద్యోగులు, తనతో చర్చలు జరిపిన పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, తనను ఇంతకాలం నిశితంగా గమనించిన జర్నలిస్టులకు ఈ విషయం తెలుసని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తప్పులు చేస్తోందని విమర్శించారు. సంక్షోభం నుంచి ఆర్థిక స్థితిని గట్టెక్కించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పార్లమెంటులో తన గొంతుకను ఈ ప్రభుత్వం అణచలేదని చెప్పారు. సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.