Crime News: హైదరాబాద్ లో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను సజీవ దహనం చేసిన భార్య
- వనస్థలిపురంలో ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- స్వప్న, ఆమె ప్రియుడు వెంకటయ్య అరెస్ట్
హైదరాబాద్ లో జరిగిన మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడి వనస్థలిపురంలో భర్తను సజీవ దహనం చేసిందో భార్య. గత నెల 26న ఎస్కేడీ నగర్ లో గుడిసెకు నిప్పంటుకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. ఇందులో దారుణ విషయాలు బయటపడ్డాయి.
ప్రియుడు వెంకటయ్యతో కలిసి స్వప్న అనే మహిళ తన భర్తను చంపేసిందని పోలీసులు తేల్చారు. గతనెల 26న ప్రియుడితో కలిసి గుడిసెపై పెట్రోల్ పోసి స్వప్న నిప్పంటించిందని పోలీసులు వివరించారు. ఈ ఘటనలో స్వప్నతో పాటు ఆమె ప్రియుడు వెంకటయ్యను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.