Narendra Modi: మన దేశ ఇబ్బందులకు కారణం ఇదే: రాహుల్ గాంధీ

  • మోదీ, అమిత్ షాలు ఊహల ప్రపంచంలో ఉంటారు
  • బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు ఉండవు
  • దేశ ఆర్థిక స్థితిని ఉద్దేశించి రాహుల్ విమర్శలు
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. వారిద్దరూ ఊహల్లో జీవిస్తుంటారని ఆయన ఎద్దేవా చేశారు. వారి ఊహల ప్రపంచంతో తప్ప... బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు ఉండవని విమర్శించారు. వారి సొంత ప్రపంచంలో విహరిస్తూ... వివిధ అంశాలపై భ్రమల్లో తేలిపోతుంటారని అన్నారు. అందుకే మన దేశం ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెప్పారు. దేశ ఆర్థిక స్థితిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

Narendra Modi
Amit Shah
BJP
Rahul Gandhi
Congress

More Telugu News