Amitabh Bachchan: అత్యాచారాలపై 30 ఏళ్ల క్రితం అమితాబ్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న వైనం

  • అత్యాచారాలపై 1990లో అమితాబ్ సంచలన వ్యాఖ్యలు
  • అత్యాచారం తప్పదనుకున్నప్పుడు.. ఎంజాయ్ చేయడమేనన్న బిగ్ బీ
  • తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు
దిశ హత్యాచార ఘటనతో యావత్ దేశం రగిలిపోతోంది. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి బహిరంగంగా మరణశిక్షను విధించాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు ఈ దారుణ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే, తాను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిగ్ బీ అమితాబ్ ను వెంటాడుతున్నాయి. అత్యాచారాలపై 1990లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అత్యాచారం తప్పదనుకున్నప్పుడు... వెనక్కి పడుకుని దాన్ని ఎంజాయ్ చేయండంటూ అప్పట్లో అమితాబ్ వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1990లో 'మూవీ' అనే మేగజీన్ కవర్ పేజీ మీద వున్న అమితాబ్ చేసిన వ్యాఖ్యలతో కూడిన ఫొటోను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు. సూపర్ స్టార్లే ఇలా మాట్లాడితే... మహిళలకు రక్షణ ఎక్కడుంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అమితాబ్ ఇంకా స్పందించాల్సి ఉంది.
Amitabh Bachchan
Rape
Bollywood

More Telugu News