Disha: ఇలాంటి ఘటనలపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు: మమ్ముట్టి

  • దిశ హత్యోదంతం దిగ్భ్రాంతికి గురి చేసింది
  • ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారు వారిని వారే ప్రశ్నించుకోవాలి
  • ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఆలోచించాలి
హైదరాబాదులో చోటుచేసుకున్న దిశ ఘటనపై ప్రముఖ సినీ నటుడు మమ్ముట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దిశ హత్యోదంతం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారు తమను తాము ప్రశ్నించుకోవాలని... ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఆలోచించుకోవాలని అన్నారు. తమకు ఏం జరుగుతుందో అని తాను సహా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని చెప్పారు.

దిశ ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఉభయసభలు కూడా ఈ అంశంపై ఒక రోజంతా చర్చించింది. దేశ సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీలు ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Disha
Mammootty

More Telugu News