Rajya Sabha: పార్లమెంటుకు చేరుకున్న చిదంబరం

  • నిన్న జైలు నుంచి విడుదల 
  • మీడియాతో మాట్లాడని చిదంబరం
  • రాజ్యసభలో మాట్లాడే అవకాశం?
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఆయన.. ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయనను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది. అయితే, ఐన్‌ఎక్స్ మీడియా కేసులో మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rajya Sabha

More Telugu News