Sundeep Kishan: అమరావతిలో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న హీరో సందీప్ కిషన్

  • ఇప్పటికే రెస్టారెంట్లను నిర్వహిస్తున్న సందీప్ కిషన్
  • అమరావతిలో సెలూన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న యంగ్ హీరో
  • క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని తీసుకున్న సందీప్ కిషన్
సినీ నటీనటులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్లు పలు వ్యాపారాలను ప్రారంభించారు. హీరో సందీప్ కిషన్ కూడా ఇప్పటికే సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నాడు. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు.

తాజాగా మరో బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఏపీ రాజధాని అమరావతిలో ఓ సెలూన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ రంగంలో పేరుగాంచిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ తీసుకున్నాడు. త్వరలోనే ఈ సెలూన్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం 'ఏ1 ఎక్స్ ప్రెస్' సినిమాలో సందీప్ నటిస్తున్నాడు. అంతేకాదు, నిర్మాతగా 'నిను వీడని నీడను నేనే' సినిమాను తెరకెక్కించి, విజయాన్ని అందుకున్నాడు.
Sundeep Kishan
Tollywood
New Business

More Telugu News