తీహార్ నుంచి బయటకు వచ్చి... నేరుగా సోనియా ఇంటికి వెళ్లిన చిదంబరం!
- నిన్న రాత్రి 8 గంటల సమయంలో విడుదల
- ఆ వెంటనే సోనియా నివాసానికి
- పార్టీ అండగా ఉంటుందని సోనియా హామీ
ఇక సోనియాను కలిసి, ఆమెతో దాదాపు 45 నిమిషాలకు పైగా భేటీ అయిన చిదంబరం, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తనపై ఉన్న కేసుల గురించి చర్చించినట్టు సమాచారం. చిదంబరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సోనియా, పార్టీ ఆయనకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, గత వారంలో ప్రియాంకతో కలిసి తీహార్ జైలుకు వెళ్లిన సోనియా, కాసేపు చిదంబరంతో మాట్లాడి వచ్చిన సంగతి తెలిసిందే.