Chandrababu: హిందూమతానికి బ్రాండ్ అంబాసిడర్లలా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారు!: కొడాలి నాని

  • చంద్రబాబు ఇంటి పక్కన మతమార్పిడి జరిగితే జగన్ పై విమర్శలా?
  • కులాలు, మతాలపై రాజకీయాలు చేస్తున్నారు
  • టీడీపీ, జనసేనను బీజేపీలో విలీనం చేయాలనుకుంటే మాకు అభ్యంతరం లేదు
కృష్ణానది ఒడ్డున మతమార్పిడులు జరుగుతున్నాయంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటి పక్కనే మతమార్పిడి జరిగితే సీఎం జగన్ పై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కృష్ణానది ఒడ్డున వున్నది జగన్ కాదని, చంద్రబాబే అన్న విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని అన్నారు.

రాష్ట్రంలో కులాలు, మతాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీలపై ఆయన మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీలో విలీనం చేయాలనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదంటూ సెటైర్లు విసిరారు. హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట్లాడుతున్నారని, తమ పార్టీపై కుయుక్తులు పన్నుతున్నారని విరుచుకుపడ్డారు.
Chandrababu
Pawan Kalyan
Kodali Nani
YSRCP

More Telugu News