kurnool: కర్నూలును స్మార్ట్ సిటీ చేయాలని కేంద్రాన్ని కోరాను: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్

  • రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందితే పరిశీలిస్తామంది
  • కేంద్ర నిధులు విడుదలైనా అభివృద్ధి నత్తనడకగా వుంది
  • అమిత్ షాని పవన్ ప్రశంసించడం సంతోషమే
కర్నూలును స్మార్ట్ సిటీ చేయాలని కేంద్రాన్ని కోరానని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందితే పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పటికీ కర్నూలులో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని విమర్శించారు.

ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేస్తానంటోందని, రాయలసీమలో ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జనసేనను బీజేపీలో విలీనం చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అమిత్ షాని పవన్ ప్రశంసించడం సంతోషమే కానీ, తమతో కలిసి ఆయన పోరాడతారా? అనేదే అసలు ప్రశ్న అని అన్నారు.


kurnool
bjp
mp
TG Venkatesh
Pawan Kalyan

More Telugu News