Disa: దిశ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం

  • ఏడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన షాద్ నగర్ కోర్టు
  • రేపటి నుంచి నిందితులను విచారించనున్న పోలీసులు
  • ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్న నిందితులు
దిశ కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు షాద్ నగర్ కోర్టు అనుమతించింది. ఏడు రోజుల కస్టడీకి అనుమతిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. రేపటి నుంచి నిందితులను పోలీసులు విచారించనున్నారు. కాగా, ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైల్లో రిమాండ్ లో వున్నారు. దీంతో విచారణ కోసం నిందితులను అదుపులోకి తీసుకోవాలా? లేక జైల్లోనే వారిని విచారించాలా? అనే దానిపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. నిందితులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృష్ట్యా వారిని జైల్లోనే విచారించే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది.
Disa
Shadnagar
court
police custody

More Telugu News