ఏ నరసింహస్వామి విగ్రహానికైనా నాలుక బయటకొచ్చే ఉంటుంది: యాదాద్రి వివాదంపై అర్చకుల వివరణ
- మూలవిరాట్ లో మార్పులు చేస్తున్నారన్నది అబద్ధం
- ఇలాంటి వార్తలను ఖండిస్తున్నాం
- శిల్ప శాస్త్ర ప్రకారం నరసింహస్వామికి నాలుక బయటే వుంటుంది
'స్వామి వారి మూలవిరాట్ లో నాలుక బయటకొచ్చే విధంగా శిల్పులు చెక్కారన్న వార్త అబద్ధం. ఎందుకంటే, ఒక్క యాదగిరి గుట్టలోనే కాదు శిల్ప శాస్త్రం ప్రకారం వుండే ప్రపంచంలో ఏ నారసింహుడి విగ్రహాన్ని చూసినా నాలుక బయటకొచ్చే ఉంటుంది' అన్నారు.
కొన్ని దశాబ్దాలుగా నారసింహస్వామి వారికి సింధూరం వేస్తున్నామని, ఈ క్రమంలో సుమారు పదిహేను అంగుళాల పైచిలుకు అది అతుక్కుపోయి వుందని, దాన్ని స్వయంగా తాము తొలగించామని చెప్పారు. స్వామి వారి మూలవిరాట్ ను తాము తప్ప ఎవరినీ ముట్టుకోనివ్వమని, ఎవరైతే అభిషేకం, అర్చన చేస్తారో వాళ్లే ముట్టుకుంటారని చెప్పారు.