Narendra Modi: నాపైనా, మోదీ, అమిత్ షాలపైనా చిదంబరం తప్పుడు కేసులు పెట్టారు: నితిన్ గడ్కరీ

  • చిదంబరంపై కేసులకు ఆధారాలు ఉన్నాయి
  • హోం మంత్రిగా ఉన్నప్పుడు మాపై ఆయన కేసులు పెట్టారు
  • ఆ కేసుల నుంచి మేము నిర్దోషులుగా బయటపడ్డాం
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరంకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో... కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిదంబరంపై నమోదు చేసిన కేసులకు ఆధారాలు ఉన్నాయని, విచారణ జరుగుతోందని, ఆయనకు సంబంధించి కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు... మోదీ, అమిత్ షాలతో పాటు తనపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అయితే, ఆ కేసుల నుంచి తాము నిర్దోషులుగా బయటపడ్డామని చెప్పారు. మరోవైపు, బెయిల్ మంజూరు కావడంతో ఈ సాయంత్రంలోగా చిదంబరం జైలు నుంచి విడుదల కానున్నారు. రేపు ఆయన పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంది.
Narendra Modi
Amit Shah
Nitin Gadkari
BJP
Chidambaram
Congress

More Telugu News