Crime News: అత్యాచారం చేయబోయిన వ్యక్తిని చితకబాదిన గ్రామస్థులు

  • మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నం 
  • చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో ఘటన 
  • కేసు నమోదు చేసిన పోలీసులు

మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయబోయిన వ్యక్తిని పట్టుకుని గ్రామస్థులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచారోదంతంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిందితులను ఉరితీయాలంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఎవరు ఏ చిన్న తప్పుచేసినా జనం ఉపేక్షించే పరిస్థితి కనిపించడం లేదు. సరిగ్గా అటువంటి సమయంలోనే తప్పుచేసి దొరికాడీ యువకుడు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన గంగాధరం అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేయబోయాడు. దీంతో భయపడిన బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు గంగాధరాన్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.

Crime News
rape attempt
villagers manhandling
police
Chittoor District

More Telugu News