Pawan Kalyan: తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్న పవన్ కల్యాణ్!

  • వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయానికి
  • స్వామిని దర్శించుకోవడం నా అదృష్టం
  • ప్రజలు సుఖంగా ఉండాలని ప్రార్థించానన్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు స్థానిక నేతలు కూడా ఉన్నారు. పవన్ కు స్వాగతం పలికిన ప్రొటోకాల్ అధికారులు, వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు.

పవన్ ను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను 30 సంవత్సరాల క్రితం తిరుపతిలో 'ధర్మో రక్షతి రక్షితః' అని నేర్చుకున్నానని, ఇప్పటికీ దాన్నే పాటిస్తున్నానని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వరుడుని ప్రార్థించినట్టు తెలిపారు.
Pawan Kalyan
Tirumala
Tirupati

More Telugu News