Andhra Pradesh: ఒంగోలు సమీపంలో ఘోరం.. తల్లీకూతుళ్లను తగలబెట్టిన దుండగులు!

  • 25 ఏళ్ల తల్లి, ఏడాది బిడ్డను తగలబెట్టిన దుండగులు
  • పేర్నమిట్ట నుంచి మారెళ్లగుంటపాలెంకు వెళ్లే దారిలో ఘటన
  • పోలీసులు చేరుకునే సమయానికి కాలిపోయిన మృతదేహాలు
దిశ హత్యోదంతంతో యావత్ దేశం అట్టుడుకుతున్నప్పటికీ... మృగాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఎలాంటి భయం లేకుండా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా, ఏపీలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఒంగోలు సమీపంలో తల్లీకూతుళ్లను రాళ్లతో కొట్టి, ఆ తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన కలకలం రేపుతోంది.

పేర్నమిట్ట నుంచి మారెళ్లగుంటపాలెంకు వెళ్లే దారిలో ఓ యువతి, ఏడాది పాప మంటల్లో తగలబడుతున్నట్టు నిన్న రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒంగోలు మండలం, మద్దిపాడు పోలీసులు హుటాహుటిన ఆ స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రెండు మృతదేహాలు కాలిపోయి ఉన్నాయి. యువతికి 25 ఏళ్ల వయసు ఉంటుందని, ఆమె కుమార్తెకు ఏడాది వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Andhra Pradesh
Mother
Daughter
Fire
Murder

More Telugu News