Anantapur District: అనంతపురం జిల్లాలో అమానుషం.. భార్యపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్!

  • కదిరిలో అమానుష ఘటన
  • భార్యపై తన స్నేహితులతో కలిసి అత్యాచారం
  • భార్య కాళ్లుచేతులూ కట్టేసి దారుణం
అనంతపురం జిల్లా కదిరిలో అమానుష ఘటన జరిగింది. భార్యపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం సేవించిన ఆమె భర్త మల్లేశ్, అతని స్నేహితులతో కలిసి భార్య కాళ్లు, చేతులు కట్టేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు రోదిస్తుండటంతో స్థానికులు ఈ విషయమై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది.

అంగన్ వాడీ కార్యకర్తలు అండగా నిలబడటంతో ఆమె ఈ ఘటన గురించి మీడియాకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మల్లేశ్ గతంలో కూడా ఓ బాలికను రేప్ చేసి జైలుకు వెళ్లాడు. ‘నా భర్త, వేరే వాళ్లు వచ్చి నా కాళ్లుచేతులూ కట్టేసి రేప్ చేశారు’ అని మీడియాతో బాధితురాలు చెప్పింది.
Anantapur District
Kadiri
Gang rape

More Telugu News