ఆర్ఎస్ఐ అర్జునరావును భుజం తట్టి అభినందించిన సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
కాలువలో కొట్టుకుపోతున్న మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన రిజర్వ్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ అర్జునరావుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం జగన్ కూడా అర్జునరావును ప్రశంసించారు. అర్జునరావు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. అర్జునరావును అడిగి ఆయన చేసిన సాహసం గురించి తెలుసుకున్నారు.

ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్ కు అర్జునరావు పేరును సిఫారసు చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంక బందరు కాలువలో నిన్న ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాలువ పక్కనే ఉన్న క్వార్టర్స్ లోంచి ఈ విషయాన్ని గమనించిన అర్జునరావు నీటిలో దూకి మహిళను కాపాడారు. అర్జునరావు ప్రస్తుతం సీఎం కాన్వాయ్ లో పైలెట్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
RSI
Woman
Police

More Telugu News