cm: సీఎం జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలి: కళా వెంకట్రావు డిమాండ్

  • మహిళా హోం మంత్రి హయాంలో ఇలాంటి ఘటనలు దారుణం
  • మహిళలపై సీఎం జగన్ కు ఉన్న గౌరవం ఇదేనా?
  • టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు
టీడీపీ మహిళా కార్యకర్త, రైతు పద్మజను పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ నేత కళావెంకట్రావు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళా హోం మంత్రి హయాంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళలపై సీఎం జగన్ కు ఉన్న గౌరవం ఇదేనా? అన్నారు. మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేసిన వారిని వదిలిపెట్టి టీడీపీ శ్రేణులను వేధించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం సరికాదని అన్నారు.
cm
jagan
Telugudesam
kalavenkatrao
sucharita

More Telugu News