Hema Malini: అలాంటివారు బయటకు వస్తే ఇతరులను కూడా నేరాలు చేసేలా ప్రోత్సహిస్తారు: హేమమాలిని

  • దిశ హత్యోదంతంపై స్పందించిన హేమమాలిని
  • నేరస్తులను శాశ్వతంగా జైల్లోనే ఉంచాలని వ్యాఖ్య
  • ప్రతి రోజు ఏదో ఒక చోట మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది
హైదరాబాద్ శివార్లలో దారుణ హత్యకు గురైన దిశ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందిస్తూ, ఇలాంటి ఘటనల్లో నేరస్తుల్ని శాశ్వతంగా జైల్లోనే ఉంచాలని అభిప్రాయపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపై హింస కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు శాశ్వతంగా జైల్లోనే ఉండాలనేది తన అభిప్రాయమని తెలిపారు. ఇలాంటి వారు జైలు నుంచి బయటకు వస్తే... ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. క్రూరమైన మనస్తత్వం కలిగిన ఇలాంటి వాళ్లు బయటకు వస్తే... ఇతరులు కూడా నేరాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తారని తెలిపారు.
Hema Malini
Disha
BJP

More Telugu News