భారత జలాల్లో అనుమానాస్పద చైనా నౌక... వెంటపడి తరిమేసిన భారత నేవీ!
- పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఘటన
- నిఘా నిమిత్తం వచ్చిన 'షీ యాన్ 1'
- గుర్తించిన భారత నిఘా విమానాలు
పేరుకు మాత్రమే అది రీసెర్చ్ నౌకని, కానీ చేస్తున్నది మాత్రం గూఢచర్యమని నేవీ వర్గాలు వెల్లడించాయి. సముద్రంలో భారత కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకే అది వచ్చిందని, ఈ తరహా చర్యలను భారత్ అడ్డుకుని తీరుతుందని అన్నారు. నిజంగా అది రీసెర్చ్ కోసం వస్తే, భారత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని, ఈ విషయం చైనాకు తెలుసునని ఓ అధికారి వ్యాఖ్యానించారు.