Nani: వెరైటీ టైటిల్ తో నాని కొత్త సినిమా!

  • కొత్త చిత్రానికి 'టక్ జగదీష్' అనే టైటిల్
  • ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన నాని 
  • వైరల్ అవుతున్న చిత్రం
వినూత్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న నాని, ప్రస్తుతం 'వి' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం 'గ్యాంగ్ లీడర్' తో అలరించిన ఆయన, తన కొత్త చిత్రం గురించి తాజాగా చెప్పేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని చెబుతూ, దీని టైటిల్ ను ఈ ఉదయం ప్రకటించాడు. కొత్త చిత్రానికి 'టక్ జగదీష్' అని టైటిల్ పెట్టినట్టు నాని వెల్లడించాడు. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇక 'టక్ జగదీష్' ఫస్ట్ లుక్ ను కూడా నాని రివీల్ చేశాడు. వెనక్కు తిరిగి తన టక్ ను సర్దుకుంటున్నట్టుగా ఉన్న నాని లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 2020 వేసవి సెలవుల సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. కాగా, నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన 'నిన్ను కోరి' చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే.
Nani
Tuck Jagadish
New Movie
First Look

More Telugu News