Ramajogayya Sastry: నా మొదటి పాట కన్నడలో రాశాను: రామజోగయ్యశాస్త్రి

  • మాది గుంటూరు జిల్లాలోని ముప్పాళ గ్రామం 
  • బెంగళూరులో ఏడేళ్లపాటు ఉద్యోగం చేశాను 
  • కన్నడ సినిమాతో లిరిక్ రైటర్ గా మారానన్న శాస్త్రి
తెలుగు పాటను మరింత ఉత్సాహంతో పరుగులు తీయించిన గీత రచయితలలో రామజోగయ్య శాస్త్రి ఒకరు. అటు మాస్ .. ఇటు క్లాస్ సాంగ్స్ ను రాయడం ఆయన ప్రత్యేకత. పద ప్రయోగాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే రామజోగయ్య శాస్త్రి, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు.

"మాది గుంటూరు జిల్లా నరసరావుపేటకి సమీపంలోని 'ముప్పాళ' గ్రామం. నేను ఎంటెక్ పూర్తిచేశాను .. బెంగళూర్లో ఏడేళ్లపాటు ఉద్యోగం చేశాను. అక్కడ ఉండటం వలన నాకు కన్నడ నేర్చుకునే అవకాశం వచ్చింది. అంతేకాదు తొలి పాట కన్నడ సినిమాకి రాసే అవకాశం వచ్చింది. కన్నడలో రమేశ్ అరవింద్ కథానాయకుడిగా చేసిన ఒక సినిమాకి నేను తొలిసారిగా పాటలు రాశాను. ఆ పాటల వలన నాకు మంచి పేరు రావడంతో లిరిక్ రైటర్ గా నా ప్రయాణం మొదలైంది" అని చెప్పుకొచ్చారు.
Ramajogayya Sastry
Ali

More Telugu News