Narendra Modi: హస్తినలో కేసీఆర్... మోదీ అపాయింట్ మెంట్ కోసం వెయిటింగ్!

  • నిన్న రాత్రి న్యూఢిల్లీకి వెళ్లిన కేసీఆర్
  • ఇంకా ఖరారుకాని మోదీ అపాయింట్ మెంట్
  • లభిస్తే రాత్రికి న్యూఢిల్లీలోనే
నిన్న రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నేడు అపాయింట్ మెంట్ దొరికే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తుండగా, కనీసం రేపు మోదీతో భేటీకి అవకాశం కుదిరినా, రాత్రికి కేసీఆర్ ఢిల్లీలోనే బస చేస్తారని సమాచారం. ఒకవేళ, అపాయింట్ మెంట్ లభించదని భావిస్తే మాత్రం ఆయన సాయంత్రం బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

ఇక మోదీతో భేటీకి అవకాశం లభిస్తే, రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుతో పాటు విభజన తరువాత అపరిష్కృతంగా ఉన్న దాదాపు 30 అంశాలను ఆయన ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. నేటి సాయంత్రం కేసీఆర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ తనయుడి వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్నారు.
Narendra Modi
KCR
Appointment
New Delhi

More Telugu News