Rajanikant: ప్రత్యేక ప్రతిభావంతుడికి రజనీకాంత్ పాదచాలనం!

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, తన పుట్టిన తిథి, నక్షత్రం ప్రకారం సోమవారం నాడు పుట్టిన రోజును జరుపుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళకు చెందిన వీరాభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని కలిశారు రజనీ. ప్రత్యేక ప్రతిభావంతుడైన అతనికి కరచాలనం చేసేందుకు చేతులు లేవు. దీంతో రజనీ అతని పాదాలను తాకి పాదచాలనం చేశారు. అతనితో కాసేపు ముచ్చటించారు. ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. తేదీల ప్రకారం, ఈ నెల 12న రజనీ పుట్టిన రోజు కాగా, అత్యంత వేడుకగా జరిపేందుకు అభిమాన సంఘాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
Go Back to Shorts
Rajanikant
Birthday
Fans
Kerala

More Telugu News