Uttar Pradesh: యూపీలో దారుణం.. 70 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 
  • మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న ప్రతిపక్షాలు
  • యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మండిపాటు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన రాజకీయంగా పెను దుమారం రేపింది. సోన్‌భద్ర జిల్లా అన్పర గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నిందితుడు రాంకిషన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాధితురాలైన  వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలు,  బాలికలకు రక్షణ లేకుండా పోయిందని సమాజ్ వాదీ పార్టీ  చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో  పరిస్థితి దారుణంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు.
Uttar Pradesh
Yogi Adityanath
rape

More Telugu News