Andhra Pradesh: అలాంటి సన్నాసులు నన్ను బూతుల మంత్రి అంటే అయిపోతానా?: ఏపీ మంత్రి కొడాలి నాని

  • జగన్ ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు
  • ఇష్టానుసారం మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?
  • మంత్రి హోదాలో వుంటే నోరుమూసుకుని ఉండాలా?  
వైఎస్ జగన్ ని ఇబ్బంది పెట్టాలని, కులాల కుంపటిలోకి ఆయన్ని లాగాలని చంద్రబాబునాయుడు చూస్తున్నాడని, ఇలాంటి వేషాలు వేయొద్దని ఆయనకు తీవ్రంగా చెబుతున్నామే తప్ప, ఆయన మీద తమకు కోపమేమీ లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంను, తమ నాయకుడిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే మంత్రి హోదాలో ఉన్నాం కనుక నోరుమూసుకుని పడి వుండాలనడం సబబు కాదని అన్నారు. ‘నన్ను బూతుల మంత్రి అనేది ఎవరు? రోజూ ఐదు వేలు, పదివేల రూపాయల కోసం, పలావ్ ప్యాకెట్ల కోసం ప్రెస్ మీట్లు పెట్టేటువంటి సన్నాసులు నన్ను బూతుల మంత్రి అంటే అయిపోతానా?’ అని ప్రశ్నించారు.
Andhra Pradesh
Minister
kodali Nani
jagan
ys

More Telugu News