శివాంగి.. భారత నేవీలో తొలి మహిళా పైలెట్!
- బీహార్ కు చెందిన శివాంగికి నేవీ పైలెట్ బాధ్యతలు
- కొచ్చిలో బాధ్యతలు స్వీకరించిన శివాంగి
- నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న బీహార్ అమ్మాయి
ప్రస్తుతం నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న శివాంగికి తాజాగా డోర్నియర్ నిఘా విమానం పైలెట్ గా బాధ్యతలు అప్పగించారు. కొచ్చిలోని నేవల్ బేస్ అధికారులు శివాంగికి స్వాగతం పలికారు. భారత ప్రాదేశిక సముద్ర జలాలపై శివాంగి విమానంలో ప్రయాణిస్తూ నిఘా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సముద్రంలో అనుమానాస్పద నౌకలు కనిపిస్తే బలగాలకు సమాచారం అందించాలి.