Priyanka Gandhi: అనుమతి లేకుండా ప్రియాంక గాంధీ నివాసంలోకి దూసుకొచ్చిన కారు

  • గత నెల 25న ఘటన
  • కారులో అమ్మాయి సహా ఐదుగురు వ్యక్తులు
  • ఇటీవలే గాంధీలకు ఎస్పీజీ భద్రత ఉపసంహరించిన కేంద్రం
  కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాసంలోకి నవంబరు 25న ఓ కారు అనుమతి లేకుండా ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెల్లడైంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రియాంక నివాసంలోకి కారు చొరబడడంతో అందరూ నివ్వెరపోయారు. ఆ కారులో ఓ అమ్మాయి సహా ఐదుగురు వ్యక్తులున్నారు. వారు కారు దిగి అప్పటికే గార్డెన్ లో ఉన్న ప్రియాంక వద్దకు వెళ్లారు. ముందస్తు అనుమతి లేకుండా భద్రత వలయాన్ని దాటుకుని ఓ కారు ప్రవేశించడం పట్ల ప్రియాంక ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఇటీవలే సోనియా, రాహుల్, ప్రియాంకలకు కేంద్రం ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకుని సీఆర్పీఎఫ్ కమెండోల ద్వారా జడ్ ప్లస్ భద్రత అందిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రత వలయాన్ని దాటుకుని కారు ప్రవేశించడం పట్ల అధికారులు విచారణకు ఆదేశించారు.  కాగా, కారులో ప్రియాంక నివాసంలో ప్రవేశించినవాళ్లు ఉత్తరప్రదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. ప్రియాంకతో సెల్ఫీ కోసమే వచ్చినట్టు తెలుస్తోంది.
Priyanka Gandhi
Congress
New Delhi
Car
SPG
CRPF
Z Plus

More Telugu News