Manish Pandey: సినీతారను పెళ్లాడిన టీమిండియా యువ క్రికెటర్ మనీశ్ పాండే

  • నటి అశ్రిత శెట్టితో మనీశ్ పాండే వివాహం
  • ముంబయిలో ఘనంగా పెళ్లి
  • పెళ్లికి ముందురోజు దేశవాళీ టోర్నీ ఫైనల్స్ ఆడిన పాండే
క్రికెటర్లు సినీ తారలను పెళ్లాడడం ఇప్పటిది కాదు. తాజాగా టీమిండియా యువ ఆటగాడు మనీశ్ పాండే కూడా సీనియర్ల బాటలోనే నడిచాడు. నటి అశ్రిత శెట్టితో మనీశ్ పాండే వివాహం ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు.

 మనీశ్ పాండే, అశ్రిత గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, పెళ్లికి ముందురోజు మనీశ్ పాండే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్నాడు. కర్ణాటక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన పాండే ధాటిగా ఆడి 45 బంతుల్లోనే 60 పరుగులు చేసి టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, మనీశ్ పాండే వివాహమాడిన అశ్రిత శెట్టి స్వస్థలం ముంబయి. ఆమె మోడలింగ్ తో గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది.
Manish Pandey
Cricket
India
Ashrita Shetty

More Telugu News