Disha: మా అమ్మాయితో కలిసి అమ్మవారిని దర్శించుకుందామనుకుంటే చివరికి ఇక్కడ అస్థికలు కలపాల్సి వచ్చింది: దిశ తండ్రి కన్నీటివేదన

  • దిశ అంత్యక్రియలు పూర్తి
  • అస్థికలను కృష్ణానదిలో కలిపిన కుటుంబసభ్యులు
  • దోషులను కాల్చి చంపాలని డిమాండ్
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో నిందితులకు మరణశిక్ష తప్ప మరొకటి వద్దని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. మరోవైపు, దిశ కుటుంబ సభ్యులు ఎవరినీ కలిసేందుకు ఇష్టపడడం లేదు. తాజాగా వారు దిశ అంత్యక్రియలు పూర్తిచేసి ఆమె అస్థికలను గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు.

ఈ సందర్భంగా దిశ తండ్రి మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రెండుమూడు రోజుల్లో తమ కుమార్తెతో కలిసి ఇక్కడి అమ్మవారిని దర్శించుకుందామని భావించామని, కానీ చివరికి ఆమె అస్థికలను ఇక్కడ కలపాల్సి వచ్చిందని కంటతడి పెట్టారు. ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలని ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.
Disha
Telangana
Hyderabad

More Telugu News