Hyderabad: దిశ హత్య ఘటనా స్థలానికి తండోపతండాలుగా వస్తున్న జనం

  • సందర్శక స్థలంగా మారిన తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతం
  • ఘోరాన్ని తల్చుకుంటూ ఆవేదన 
  • కాస్త రోడ్డు పైకి వచ్చి ఉంటే బతికేదని వ్యాఖ్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు దిశపై ఘోరం జరిగిన శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతాన్ని తండోపతండాలుగా జనం సందర్శిస్తున్నారు. బాధిత యువతికి జరిగిన ఘోరాన్ని తల్చుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సందర్శకులు. కాస్త దూరంలో ఉన్న రోడ్డు పైకి వచ్చినా ఇంత ఘోరం జరిగేది కాదని కన్నీటి పర్యంతమైన వారు కూడా ఉన్నారు.

జాతీయ రహదారి, రింగ్ రోడ్డుపై రాకపోకలు జరిపే వారిలో మెజార్టీ ప్రజలు ఘటనా స్థలి వద్ద కాసేపైనా ఆగి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాహనాల రద్దీ, జనసంచారం ఉన్న చోట ఇంతటి ఘోరం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కాల్చివేయాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

Hyderabad
samshabad
tondupalli toll plaza

More Telugu News