New Delhi: దిశ ఘటనపై జీరో అవర్ లో చర్చిద్దామన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా... ఒప్పుకోని విపక్షాలు

  • దిశ ఘటనపై వాయిదా తీర్మానం ఇచ్చిన  తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
  • ఇప్పుడే చర్చించాలని పట్టు బట్టిన విపక్ష ఎంపీలు
  • ఢిల్లీలోని జంతర్ మంతర్ లోనూ ప్రజా సంఘాల ధర్నా
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన 'దిశ' హత్యాచార ఘటనపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు, లోక్ సభలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దిశ ఘటనపై వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ ఘటనపై ఇప్పుడే చర్చించాలని విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే, జీరో అవర్ లో చర్చిద్దామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వారిని కోరుతున్నారు.

కాగా, దిశ ఘటనపై ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటున్నారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 'జస్టిస్ ఫర్ దిశ' అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు.
New Delhi
Disha
Lok Sabha

More Telugu News