Crime News: దిశ హత్యాచార ఘటనను పార్లమెంటులో ప్రస్తావించనున్న కాంగ్రెస్ ఎంపీలు

  • లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డి 
  • చర్లపల్లి జైలులో నిందితులు
  • నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్
దిశ హత్యాచార ఘటనను ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించనున్నారు. ఈ మేరకు పార్టీ తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ కేసులో నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు.

దిశ హత్య ఘటన నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ కోర్టులో షాద్ నగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు లేదా రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిపై కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోనుంది. నిందితుల తరఫున వాదించవద్దని బార్ అసోసియేషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Crime News
Hyderabad

More Telugu News